Dec 24,2022 19:28

విద్యార్థికి ట్యాబ్‌ పంపిణీ చేలస్తున్న ఎమ్మెల్యే చింతల

ప్రజాశక్తి-పీలేరు : ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలలో చదువుతున్న పేద విద్యార్థులకు భవిష్యత్‌లు డిజిటల్‌ విద్య అందించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహ న్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక బాలికోన్న పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు ఎన్‌.జయమ్మ అధ్యక్షతన మండలంలోని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మూడు వేల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తరగతి గది వెలుపల కూడా అవసరమైన సమయంలో అభ్యసనకు ఉపయోగపడేలా సిఎం విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ పోటీకి సన్నద్దులవుతారన్న ఆలోచనాతో సిఎం ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో పీలేరు సర్పంచ్‌ డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌, పాఠశాల చైర్‌పర్సన్‌ కోమల, ఎంపిడిఒ మురళీమోహన్‌రెడ్డి, ఎంఇఒ బాలాజీ నాయక్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మహమ్మద్‌ షఫీ, పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.గిరిధర్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి వెంకటా చలపతి, మస్తాన్‌ సాహెబ్‌, జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్‌ సభ్యులు షేక్‌ షాకీర్‌, కలికిరి ఎంఇఒ రంగనాథరెడ్డి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.రామమూర్తి, రాచపల్లి సురేంద్రనాథ్‌రెడ్డి, శివశంకరయ్య, శోభారాణి, సురేంద్ర, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.