ప్రజాశక్తి-వాల్మీకిపురం : కార్పొరేట్, ప్రైవేటు విద్యాభోదనకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధునాతనమైన విద్య అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న 183 మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్యాబ్‌లను ఉచితంగా అందజేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అందిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాధులు వేస్తున్నారన్నారు. నాడు నేడు పనుల ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారని, విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. ట్యాబ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన సిబిఎస్‌ఇకి అవసరమైన కంటెంట్ కూడా ఉంటుందన్నారు. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ చదువుకునే వెసులుబాటు ఈ ట్యాబ్‌లలో అందుబాటులో ఉంటుందన్నారు. ప్రైవేటుగా ఈ తరహా విద్యాబోధనకు వేల రూపాయల ఖర్చు అవుతుందని, కానీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్ అహ్మద్, హెచ్‌ఎం శ్రీదేవి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం అమరనాథరెడ్డి, సర్పంచ్ గంగులమ్మ, నాయకులు చింతల ఆనంద రెడ్డి, నీళ్లభాస్కర్, కేశవ రెడ్డి, అబ్దుల్ కలీమ్, ఆనంద, రాయుడు, ఉపాధ్యాయులు నాగరాజ, రసూల్ బావాజి, బాలాజి, విద్యార్థులు పాల్గొన్నారు. రామాపురం : ఎపి మోడల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాజీ ఎంఎల్‌ఎ గడికోట మోహన్‌రెడ్డి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు 450మంది ఉన్నారని అన్నారు. వారిలో 15 మందికి మాత్రమే పంపిణీ చేశామని, మిగిలిన వారికి రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం మరి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ శ్యామలదేవి, ఎంఇఒ రామకృష్ణుడు, కొండవాండ్లపల్లె ప్రధానోపాధ్యాయులు షామీర్‌బాష, ఉపాధ్యాయులు మాజీ ఎంఎల్‌ఎను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి మండల కన్వీనర్ గడికోట జనార్దన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధరెడ్డి, జడ్‌పిటిసి మానస వెంకటరమణ, వైసిపి రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రెటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి సర్పంచులు నాగభూషణ్ రెడ్డి, రామాంజులు, వైస్ ఎంపిపి రవిశంకర్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎంపీటీసీ హరినాథ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, స్కూల్‌కమిటీ చైర్మన్ ధర్మారెడ్డి. ఉపాధ్యాయులు శంకర్ రెడ్డి రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.










