Dec 30,2022 19:23

విద్యార్థులకు చలికోట్లు పంపిణీ చేస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌: ధాత్రీ ఫౌండేషన్‌, సిర్డ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్లస్టర్‌-6 మదనపల్లి, అక్షర యజ్ఞం సెంటర్‌లో ఉన్న 200 మంది పేద పిల్లలకు చలికోట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్‌డిఒ మురళి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందురూ కూడా చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. చదువుతో పాటుగా ఆట పాటలతో కూడా ముందు ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అక్షరయజ్ఞం సెంటర్స్‌ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ధాత్రి ఫౌండేషన్‌ అధ్యక్షరాలు డాక్టర్‌ స్వాతికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ స్వాతి మాట్లాడుతూ సాయంత్రం పూట ప్రతి రోజూ రెండు గంటలు పాటు ఆడుతూ పడుతూ పిల్లలు చదువు కొంటున్నారని, ప్రస్తుతం 12 సెంటర్స్‌ కలవని, ఎవరైనా దాతలు ముందుకు వస్తే మదనపల్లి, పరిసర ప్రాంతాలలో మరికొన్ని సెంటర్స్‌ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి మంచి విద్యను అందిచవచ్చానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అక్షరయజ్ఞం సెంటర్స్‌ టీచర్స్‌, రాజరాజేశ్వరి గుడి పతంజలి స్వామి, క్లస్టర్‌ కో-ఆర్డినేటర్‌ రమణ విద్యార్థులు పాల్గొన్నారు.