Aug 02,2022 22:53

ప్రజాశక్తి-విజయవాడ
కృష్ణలంక 21,22 డివిజన్ల పరిధిలోని పద్మావతి, విశ్వేశ్వర ఘాట్లపై ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేయవద్దని సిపిఎం రెండు డివిజన్‌ కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. ఫుడ్‌ కోర్టు వద్ద నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ... పద్మావతి, విశ్వేశ్వర ఘాట్‌పై ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఫుడ్‌ కోర్టు నిర్మాణం చేపట్టినట్లయితే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఫుడ్‌ కోర్టుఏర్పాటు చేయకముందే అప్పుడే ప్రతి షాపు వద్ద నుంచి ఎంతెంత వసూలు చేయాలో ప్రజాప్రతినిధులు లెక్కల్లో మునిగి తేలుతున్నారని దుయ్యబట్టారు. పుడ్‌ కోర్టు మాటున భారీ అవినీతి అక్రమాలకు పాల్పడబోయే వ్యవహారాల పట్ల నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, జిల్లా కమిటీ సభ్యులు పుప్పాల కష్ణ, నగర కమిటీ సభ్యులు కోరాడ రమణ, నాయకులు తాడిరమణ, పసుపులేటి శ్రీనివాస్‌, కొండ, గోపి, లక్ష్మణకుమార్‌ , బత్తుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .