టెన్త్ ఫలితాల్లో కడప, అన్నమయ్య జిల్లాలు ఆశావహమైన స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలో కడప నాలుగు, అన్నమయ్య జిల్లా 15వ స్థానంలో నిలిచాయి. కడప నాలుగో స్థానంలో నిలవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవలి ఇంటర్ ఫలితాల్లో కడప అట్టడుగున నిలిచిన నేపథ్యంలో టెన్త్ ఫలితాల్లో మెరుగైన పనితీరును కనబరచడం ఉపశమనాన్ని కలిగించాయని చెప్పవచ్చు. టెన్త్ ఫలితాల్లోనూ బాలికలదే జోరు కనిపించడం గమనార్హం. ఏదేమైనా టెన్త్ ఫలితాల్లో ఉత్తమ స్థారాష్ట్రంలో నాలుగో స్థానంలో కడప
ష 15వ స్థానంలో అన్నమయ్య
ష టాప్‌త్రీ స్థానాల్లో కడప విద్యార్థులు
ష 81.55 శాతం బాలికల జోరు
ష కడపలో 79.43 శాతం ఉత్తీర్ణతనాల్ని కైవసం చేసుకోవడంతో జిల్లా విద్యాశాఖ అధి కార యంత్రాంగం ప్రశాంతంగా ఊపిరిపీల్చుకుందని చెప్పవచ్చు.ప్రజాశక్తి - కడప ప్రతినిధి/రాయచోటి/యంత్రాంగం
టెన్త్ ఫలితాల్లో కడప, అన్నమయ్య జిల్లాలు ఉత్తమ ఫలి తాలను సాధించాయి. కడప జిల్లాలో 79.43 శాతం ఉత్తీర్ణతా శాతంతో రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అన్నమయ్య జిల్లా 72.05 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానంలో నిలిచింది. 2022-23 ఏప్రిల్‌లో నిర్వహించిన టెన్త్ పరీక్షలకు కడప జిల్లాలో 27,097 వేల మంది హాజ రయ్యారు. ఇందులో 14,060 మంది బాలురు హాజరు కాగా 10,892 మంది పాసయ్యారు. బాలికలు 13,137 మంది హాజరు కాగా 10,632 మంది ఉత్తీర్ణత సాధి ంచారు. బాలికలు 81.55 శాతం, బాలురు 77.47 శాతం ఉత్తీర్ణత సాధించారు.2020లో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో టెన్త్ ఫలితాలు అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. 2021లో ఉమ్మడి కడప జిల్లా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆరవ స్థానం, 2022లో ఏడవ స్థానంలో నిలిచింది. తాజా ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 79.43 శాతం ఉత్తీర్ణత శాతంతో నాలుగవ స్థానంలో నిలవడం విశేషంగా ఆకర్షిస్తోంది.
జిల్లాలోని 36 మండ లాల పరిధిలోని 589 పాఠశాలలకు చెందిన 27,211 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికితోడు ఓఎస్ ఎస్‌సి కింద 91 మంది పరీక్షలకు హాజర వుతున్నారు. ఈలెక్కన జిల్లా వ్యా ప్తంగా 27,097 మంది విద్యా ర్థుల్లో 973 మంది ప్రయి వేటు పాఠ శాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఇందులో 202 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల కేటగిరీలోని బి.కోడూరు మం డలానికి చెందిన గోవిందా యపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సున్నా ఫలితాల స్థానంలో నిలి చింది. దీంతో జిల్లాలో మిగిలిన 201 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లల్లో ఉతీర్ణత సాధించడం గమనార్హం.
కడప జిల్లాలో ప్రతిభ చూపిన విద్యార్థులు
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మున్సిపల్ హైస్కూళ్లకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారితో పోటీ పడడం విశేషం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన శీలాహరిణి 590 మార్కులు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఎద్దుల వెంకట సుబ్బమ్మ హైస్కూల్‌కు చెందిన సోమల వెంకట రామశరణ్య 590 మా ర్కులు సాధించడం గమనార్హం. కడప నగరానికి చెందిన విద్యార్థులు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కడప పట్టణంలోని వికాస్ హైస్కూల్‌కు చెందిన బాజంత్రి లకీëచేతన 596 మార్కులు, సాయిబాబా స్కూల్‌కు చెందిన షేక్ రైసా ఫాతిమా 595 మార్కులు, బాలవికాస్‌కు చెందిన వులవపల్లి లోహిత 595 మార్కులు వరుస క్రమంలో నిలిచారు. వీరితోపాటు టాప్ టెన్ స్థానాల్లో కడప, వేంపల్లి, ప్రొద్దుటూరు, ఖాజీపేట బద్వేల్ మండలాలకు చెందిన విద్యార్థులే నిలవడం గమనార్హం.
అన్నమయ్యలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు
రైల్వేకోడూరు : పట్టణంలోని విక్టరీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కరస్పాండెంట్ నరసింహారెడ్డి, ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి తెలిపారు. రిషితారెడ్డి 594 మార్కు లతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు, ధర్మతేజ 591 మార్కులతో రాష్ట్ర స్థాయి ఏడవ ర్యాంకు, వివేక్ 589 మార్కులతో రాష్ట్ర స్థాయి 9వ ర్యాంకు సాధించారు. పీలేరు: పది ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన జ్ఞాపిక 593 మార్కులు, రాఫియా అజ్మీ 587 మార్కులు సాధించినట్లు శ్రీ చైతన్య స్కూల్ ఎజిఎం డాక్టర్ ఎన్.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సుమన్ గౌడ్, అకాడమిక్ డీన్ జానకీరామ్ పేర్కొన్నారు. విఎస్‌ఎన్ సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు పోతంశెట్టి నవ్యశ్రీ 593 మార్కులు, పి. మొహమ్మద్ తాలీబ్ 591 మార్కులు, ఇ.దివ్య 589 మార్కులు సాధిం చినట్లు కరస్పాండెంట్ వి.మాధవి తెలిపారు. రాజంపేట అర్బన్ : రాజు హైస్కూల్‌కు చెందిన ఎస్.హాసిని 592 మార్కులు, మధు శాలిని 592 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని పాఠశాల సిఇఒ, హెడ్మాస్టర్, అకడమిక్ ఇన్చా ర్జులు మోహన్‌రెడ్డి, రఘురామరాజు, శేషారెడ్డి, లోయర్ ఇన్‌ఛార్జి హబీబ్ తెలిపారు. రాహిత్య లక్ష్మి 589 మార్కులు, ఎస్.నిషిత సాయి 586 , ఎస్.యశస్విని 584, ఎం.హలేఖ్య 583 కె.ధరణి, ఇ.కోమల్ వర్మ 582 , ఎస్.సాధిక్ 581 మార్కులు సాధిం చారని తెలిపారు.
కెజిబివిల్లోనూ ఉత్తమ ఫలితాలు
జిల్లాలోని 17 కెజిబివి పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధి ంచాయి. ఇంటర్ ఫలితాల్లో సింహా ద్రిపురం పాఠశాలల్లో సున్నా ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం గమనార్హం. ఏదేమైనా జిల్లాలోని కెజిబివి మొదలుకుని గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉత్తమ ఫలితాలతో రాణించడం గమనార్హం.










