Apr 04,2021 10:26

కావాల్సిన పదార్థాలు : పచ్చిరొయ్యలు - అర కిలో, పసుపు - 3 టీస్పూన్లు, కారం - అర టీస్పూను, ఉప్పు-తగినంత, మామిడికాయ - ఒకటి, పచ్చికొబ్బరి - కప్పు, చింతపండు- కొద్దిగా, ఎండుమిర్చి - మూడు, మిరియాల పొడి - రుచికి సరిపడా, ధనియాలు - టీ స్పూను, ఉల్లిపాయ - ఒకటి, నూనె - టీస్పూను.
తయారుచేసే విధానం : ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి పసుపు, కారం, ఉప్పు పట్టించి, సుమారు అరగంటసేపు ఉంచాలి. పచ్చి మామిడికాయ పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. తర్వాత పచ్చికొబ్బరి, పసుపు, చింతపండు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసి మెత్తగా రుబ్బాలి. ఓ మందపాటి గిన్నెలో రొయ్యలు, మామిడికాయ ముక్కలు వేసి సుమారు అరకప్పు నీళ్లు పోసి, రుబ్బిన మిశ్రమాన్ని రెండు టేబుల్‌స్పూన్లు వేసి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత మిగిలిన మిశ్రమాన్ని వేసి తగినన్ని నీళ్లుపోసి సన్నని మంటమీద మరో పది నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఓ పాన్‌లో నూనె వేసి, ఉల్లిముక్కలు వేసి వేగాక అందులో ఉడికిన కూర మిశ్రమాన్ని వేసి కలిపితే సరి. నోరూరించే రొయ్య మామిడి రెడీ.. దీన్ని వేడివేడి అన్నంలోనూ.. రోటీలోనూ సర్వ్‌ చేసుకోవచ్చు.