ప్రజాశక్తి-వాల్మీకిపురం: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సిహెచ్‌వి రామకృష్ణ అన్నారు. గురువారం స్థానిక కోర్టు ఆవరణంలో ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులు 40 మందికి ఆరు నెలలకు సరిపోయే పౌష్టికాహారం కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నివారణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వారి వంతు కషి చేస్తుండడం అభినందనీయమన్నారు. టిబి వ్యాధి సోకితే భయపడాల్సిన అవసరం లేదని, మందులు వాడడం వలన త్వరగా నయం అవుతాయన్నారు. బిడి, సిగరెట్టు, మందు, పొగాకు తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ సోమశేఖర్, మోహన, పివి నారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డెప్ప, ఏజీపీ అశోక్ కుమార్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది నాగిరెడ్డి, మురళి, అమృత, మౌనిక, ప్రత్యూష, సృజన, చందన, రూప, సావిత్రి, పావని, చంద్రకళ, చందుప్రియ పాల్గొన్నారు.










