భోజనాన్ని పరిశీలిస్తున్న ఆర్‌జెడి
భోజనాన్ని పరిశీలిస్తున్న ఆర్‌జెడి
పాఠశాలలో పరిశీలన
రాపూరు:మండలంలోని గోనపల్లి ఉన్నత పాఠశాలను ఆర్‌జెడి బుధవారం సందర్శించారు.ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాడు-నేడు పనులు విద్యార్థిని విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాల బోనపల్లిను ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దినందుకు మండల విద్యాశాఖ అధికారి జి శ్రీనివాసరావు,ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగేంద్ర కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గోనపల్లి యుపి ప్రధానోపాధ్యాయులు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు డాక్టర్ ఆర్ ప్రసన్నకుమార్, పి.నరసిం హులు పాల్గొన్నారు.










