పాఠశాలలో ఎంఇఒ ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఎంపిపిఎస్ ఉర్థూ గర్ల్స్ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి తరగతి వారీగా విద్యార్థుల యొక్క గణిత సామర్థ్యాలను నల్లబల్లపై పరిశీలిస్తూ బోధించారు. అన్ని తరగతుల విద్యార్థులు చతుర్విధ ప్రక్రియలలో నైపుణ్యం సాధించే విధంగా పరిసరాలను పరిచయం చేస్తూ బోధన తప్పనిసరిగా ఉండాలని వర్క్ బుక్‌లను పూర్తి చేసే విధంగా ఉపాధ్యాయులు తగు బాధ్యతగా తీసుకొవాలన్నారు. విద్యార్థులతో పూర్తి చేయించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ మధ్యాహ్న భోజన రిజిస్టర్లను అలాగే ఆయాల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. సొంత పిల్లలకు ఎంత రుచి, శుచి కరంగా తయారు చేస్తామో అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాన్ని ప్రతిరోజు మెనూ ప్రకారం నిర్వహకులు ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రిజిస్టరు అప్డేట్‌గా ఉండాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.










