అన్నదానం చేస్తున్న కాచర్ల అంజి కుటుంబ సభ్యులు
ధర్మవరం టౌన్ : పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ కాచర్ల లక్ష్మి, కాచర్ల అంజి దంపతుల కుమర్తె కాచర్ల యశశ్విని పుట్టిన రోజు సందర్భంగా బిఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో బుధవారం నాడు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బిఎస్‌ఆర్ పాఠశాలలో చదువుతున్న యశశ్వని తోటి విద్యార్థుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం గొట్లూరు అనాథాశ్రమం, శివాలయాల్లో శివస్వాములు దాదాపు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










