Dec 02,2022 21:22

కొండికొండ పాఠశాలలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

       చిలమత్తూరు : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల్లో విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. జిల్లా విజలెన్స్‌ అధికారులు యోగేష్‌ బాబు, ఫణీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో చిలమత్తూరు మండలంలోని కొడికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్దలో భాగంగా అందజేస్తున్న కోడిగుడ్లు, చిక్కీలను పరిశీలించారు. మధ్యాహ్న బోజనం తనిఖీ చేసి, రికార్డులను పరిశీలన చేశారు. కాగ తనిఖీల విషయం పాత్రికేయులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. తనిఖీల సమయంలో విలేకరులను పిలవకుండా, తరువాత విజిలెన్స్‌ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారంటూ మండల విద్యాశాఖ అధికారులు పత్రిక ప్రకటన విడుదల చేయడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతన్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఇఒ నాగరాజు నాయక్‌, ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా పరిధిలోని అనంతపురం రూరల్‌ మండలం పాంపంపేట జెడ్పీ పాఠశాలలోనూ తనిఖీలు చేశారు. ఇక్కడ గుడ్ల పరిణామం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.