Jan 01,2023 09:16

విద్యార్థినికి ట్యాబ్‌ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌

          హిందూపురం : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. శనివారం రూరల్‌ మండలంలోని రాచపల్లి ఎపి రెసిడెన్షియల్‌ స్కూల్‌, పట్టణంలోని అంబేద్కర్‌ మోడల్‌ స్కూల్‌ (బ్రిడ్జి స్కూల్‌)లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ విద్యార్థులు ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ, ఎంఇఒ గంగప్ప, కౌన్సిలర్లు రహమత్‌బీ, నామణి, వైసిపి నాయకులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.