Jan 31,2023 18:43

పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు  మండలంలోని పేడూరులో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తరలింపు ప్రయత్నాన్ని విరమించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజాలు డిమాండ్‌ చేశారు. స్కూల్‌ తరలింపు యత్నాన్ని నిరసిస్తూ మంగళవారం స్కూల్‌ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలసి ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ పాఠశాలలో సుమారు 3వ తరగతి నుంచి నుంచి 8 వరకు 105 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఇక్కడ నుంచి పాఠశాల సిపిఎం నాయకులు లక్ష్మయ్య, వెంకట సుబ్బయ్య, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.