Jan 04,2023 21:44

సబ్జెక్టుపై విద్యార్థులకు ప్రశ్నలు వేస్తున్న డిఇఒ

      నంబులపూలకుంట : మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలను డిఇఒ మీనాక్షి బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలల పరిస్థితులపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టులపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆమె ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇలా సమాధానాలు చెప్పలేకపోతే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పదవ తరగతి విద్యార్థులపై మరింత దృష్టి సారించి పాఠ్యాంశాలు బోధించాలని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయులు మరింత దృష్టి కేంద్రీకరించి వారిని మందుకు తీసుకెళ్లాలని సూచించారు.