Jul 12,2021 11:44

చెన్నై : 'మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను' అని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ... తాను రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల తాను అమెరికాకు వెళ్లచ్చానని, సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయానని రజనీకాంత్‌ తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై మక్కళ్‌ మండ్రం నిర్వాహకులకు చాలా సందేహాలున్నాయని, ఈరోజు వారితో సమావేశమయ్యానని చెప్పారు. ' నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నాను ' అని రజనీకాంత్‌ ప్రకటించారు. మక్కళ్‌ మండ్రం పార్టీ ద్వారా బిజెపికి సపోర్ట్‌గా ఉందామని అనుకున్న రజనీకాంత్‌... అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు.