మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్‌రెడ్డి
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
కోవూరు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 2022 ఆగస్టు 1వ తేదీ బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడలో కామాక్షమ్మ తల్లి పరమేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించారు. ఇప్పటికీ 2023 జనవరి 25కి 100 రోజులు పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 56 వేల గడపలు తిరగడం చాలా గొప్ప కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రతి గడపకు వెళ్లి మనం ఇస్తున్నటు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేలను పంపించారు. అద్భుతమై నటువంటి ప్రోగ్రామని తెలిపారు.కార్యక్రమంలో డీఏఏబీ చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకష్ణారెడ్డి, జెడ్‌పిటిసి సభ్యురాలు కవరిగిరి శ్రీలత, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, వైస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, కోటంరెడ్డి దినేష్ రెడ్డి, సర్పంచ్ చౌటూరు లక్ష్మీ నారాయణ, తహశీల్దార్ పద్మజ, ఎంపిడిఒ శ్రీహరి, సిఐ రామకష్ణారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










