Jan 09,2023 21:24

వృద్ధుడికి కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

             తలుపుల : సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వేపమానపేట, సచివాలయ పరిధిలోని గంజివారిపల్లి, బోయపల్లి, గుర్రం గుండ్లపల్లి, సింగనపల్లి గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి ఇచ్చాక కుల, మతాలు, పార్టీలకతీతంగా ప్రతి ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మల్లికార్జున, ఎంపిపి మహమ్మద్‌ రఫీనాయక్‌, జెడ్పీ వైస్‌ఛైర్మన్‌ కులశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచులు పురుషోత్తమరెడ్డి, ఫయాజ్‌అహ్మద్‌, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.