Jan 19,2023 18:29

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి స్వర్ణలత

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపిపి ఉప్పల స్వర్ణలత పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వస భ్య సమావేశం జరిగింది. ఎంపిడిఒ కన్నం హేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్వర్ణలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. టిడిపి ఎంపిటిసి కొణతం రఘుబాబు మాట్లాడుతూ నరుకూరు పంచాయతీలో డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయాలని, దళితుల శ్మశాన వాటికను అభివద్ధి చేయాలని, జగనన్న లే అవుట్‌ కోసం సిద్ధం చేసిన భూమిలో పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం యోగి వేమన జయంతిని పురాస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. సమావేశంలో జెడ్‌పిటిసి శేషమ్మ, ఎంపిటిసిలు, సర్పంచ్‌ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.