Dec 07,2022 22:26

పల్లెకు సూచనలు చేస్తున్న చంద్రబాబు

పుట్టపర్తి రూరల్‌ : తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని టీడిపి అధినేత చంద్రబాబు తనకు సూచించినట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వన్‌ టూ వన్‌ కార్యక్రమంలో భాగంగా అధినేతను తాను బుధవారం విజయవాడలో కలిసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పుట్టపర్తి గడ్డ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడానికి అన్ని విధాల సమాయత్తం కావాలని తనకు ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సంబందించిన అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. ప్రజలకు తాను అందిస్తున్న ఆర్ధిక సాయంపై అధినేత తనను ప్రశంసించారని ఈసందర్భంగా పల్లె చెప్పారు.