ప్రజాశక్తి - రాయచోటిహొ: పార్టీ కోసం పని చేయడమే నాయకుని లక్షణమని కాంగ్రెస్ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్.అల్లాబకాష్ అన్నారు. బుధవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అందులో భాగంగా నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1885వ సంవత్సరంలో డిసెంబర్ 28న జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగిందిన్నారు. భారత దేశ స్వాతంత్ర పోరాటానికై ఆవిర్భవించి స్వాతంత్ర సంగ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఉద్యమాలలో ప్రజలను భాగస్వామ్యం చేసి దేశానికి స్వాతంత్రం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందిన్నారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ ఎస్‌ఎండి గౌస్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, కిసాన్ సెల్ అధ్యక్షుడు చెన్న కష్ణ జఫరుల్లా, ఇర్ఫాన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహబూబ్ బాషా పాల్గొన్నారు.










