Jun 23,2023 21:58

ఫొటో : మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు

పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తిస్తాం..
ప్రజాశక్తి-కావలి : తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వారికి తన వద్ద తగిన గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుందని కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆధ్వర్యంలో కావలి పట్టణ, రూరల్‌ మండల పార్టీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 27వ తేదీన కావలిలో జరగనున్న టిడిపి ''పల్లె నిద్ర'' (బస్సు యాత్ర) కార్యక్రమ వివరాలను పార్టీ శ్రేణులకు వివరించారు.
ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో శ్రేణులు విరివిగా పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 27వ తేదీన జరిగే ''పల్లెనిద్ర'' (బస్సు యాత్ర) కార్యక్రమానికి, తదనంతరం జరిగే లోకేష్‌ యువగళం పాదయాత్రకి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నామన్నారు.