పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ప్రజాశక్తి-అల్లూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రం టిటిడి కళ్యాణ మండపంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం ద్వారా వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గృహసారథులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఒక వాలంటీర్‌కి ఇద్దరు గృహసారథులు అందుబాటులో ఉంటారని తెలిపారు.రాష్ట్రంలో జగనన్న ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్లు, అందులో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గహ సారథులు అంతా కలసి 8 లక్షల మంది ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధే ధ్యేయంగా భావించి పేద ప్రజల కోసం విస్తృతంగా పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పినవి, చెప్పనివి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు పంచుతున్నారని తెలియజేశారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్దకు వెళితే వాలంటీర్ లు వచ్చి 1వ తారీఖున 5 గంటలకే పింఛన్ అందజేసి వెళ్తున్నట్లు అవ్వ,తాతలు ఆనందం వ్యక్తపరిచారన్నారు. సీనియర్ నాయకులు నీలం సాయికుమార్ మాట్లాడుతూ నగర పంచాయతీ కారణంగా సింగపేట, అల్లూరు, నార్త్ మోపూరు పంచాయతీలలో ఎస్‌సి ఎస్‌టి పాపులేషన్ అధికంగా ఉందని ఈ కారణంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. ఒక పంట లేక 2 పంటలు ఉంటాయని పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనుల ద్వారా జీవనం సాగించే వారని తెలిపారు. నగర పంచాయతీతో ఉపాధి లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకొచ్చి వినతిపత్రం సమర్పించారు. ఎంఎల్‌ఎ వెంటనే స్పందించి ఇప్పటికే మున్సిపల్ మంత్రికి సంబంధిత విషయాన్ని తెలియజేశారన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పంచాయతీలుగా చేసే బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర జెఎజిఎస్ కన్వీనర్ శివ శంకర్ రెడ్డి, మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ ఊటు శ్రీకాంత్ రెడ్డి, జెడ్‌పిటిసి చలంచర్ల వీణమ్మ, ఎంపిపి దర్శిగుంట శశిరేఖ, మండల ఉపాధ్యక్షులు గుమ్మడి సురేంద్ర, నాయకులు కోడూరు సాధకుమార్ రెడ్డి, మేడా శ్రీనివాసులు రెడ్డి, బీద రమేష్ యాదవ్, కొండూరు శ్రీనివాసులు, నార్త్ ఆములూరు సర్పంచ్ షేక్ కరిముల్లాషా ఖాదర్ తదితరులున్నారు.










