గూడు లేని పట్టణ పేదలు 11,173 మంది
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో నివసించే గూడు కూడా లేని అభాగ్యులు 11,173 మంది ఉన్నట్లు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి కౌషల్ కిశోర్ తెలిపారు. లోక్‌సభలో ఆయన ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మార్చి 3 నాటికి ఏపిలో 11,173 మంది తెలంగాణలో 4,629 మంది నివసించే ఆసరా లేనివారిగా గుర్తించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,45,783 మంది ఇలాంటి పేదలున్నారని తెలిపారు.
విమానరంగంలో 20,100 ఉద్యోగాలు ఆవిరి
దేశంలో విమాన రంగంలో 20,100 ఉద్యోగాలు ఊడాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచే యోచన లేదు
అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచే ప్రణాళిక ఏదీ లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి వివేక్ టంకా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పార్లమెంట్‌లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. కోడ్ ఆన్ వేజెస్ 2019కి సంబంధించి కేంద్రాపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు నియమ నిబంధనలను నోటిఫై చేశాయని, ఇండిస్టియల్ రిలేషన్స్ కోడ్‌కు సంబంధించి 23 రాష్ట్రాలు, సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు సంబంధించి 22 రాష్ట్రాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోడ్‌కు సంబంధించి 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు నియమ నిబంధనలను నోటిఫై చేసినట్లు మంత్రి చెప్పారు.










