ప్రజాశక్తి-నెల్లూరు :ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ మనల్ని మనం పరిపాలించుకునే సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ ఎంతో దోహదపడుతోందని కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళ వారం నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యంలో నగరంలోని టౌన్ హల్లో జరిగిన మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ మనల్ని మనం పరిపాలించుకునే సుపరిపాలన, స్వపరిపాలన వ్యవస్థకు నాంధి పలకడానికి పార్లమెంట్ వ్యవస్థ ఎంతో దోహద పడుతోందన్నారు. ఈ అత్యున్నతమైన పార్లమెంట్ వ్యవస్థ గురించి యువత తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. తొలుత కలెక్టర్ చక్రధర్ బాబు, స్వామి వివేకానంద చిత్రా పటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధికారి మహేంద్ర రెడ్డి, సెట్నల్ సి.ఈ.ఓ పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాక్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని తెలియచేశారు. నగరానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు.










