ప్రజాశక్తి -పెనుకొండ : పారిశుధ్యకార్మికులకు పేస్‌యాప్‌ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా నూతన హాజరు విధానాన్ని అమలు చేయడం సరికాదన్నారు. పారిశుధ్య కార్మికుల్లో అత్యధికమందికి స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన నైపుణ్యత లేదని, చదువుకోని కార్మికులు కూడా ఉన్నారని అన్నారు. అలాంటి వారికి స్మార్ట్ ఫోన్లు లేవని వారు ఫేస్‌యాప్‌లో ఎలా హాజరువేస్తారని ప్రశ్నించారు. తక్షణమే ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు తిప్పన్న, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు చిన్న వెంకటేష్, నరసింహులు , సూరి, శాంతమ్మ, గంగరత్నమ్మ, నరసమ్మ, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.










