Dec 12,2022 21:56

డిఐఈపిసి సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

         పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం, పిఎంఈజిపి తదితర పథకాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివద్ధి చేసి నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ జిల్లా పరిశ్రమల మేనేజర్‌ను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌ లో మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిఐఈపిసి) సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఇల ఏర్పాటుకు మండల స్థాయిలో జరిగే సమావేశాలలో పరిశ్రమల ప్రాధాన్యతలపై అవగాహన కల్పించాలని పరిశ్రమల శాఖ ఎపిఐఐసి, బ్యాంకర్లు తదితర సంబందిత అధికారులకు తెలియజేశారు. నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన తదితర పథకాల ద్వారా పారిశ్రామిక రంగాన్ని అభివద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అభివద్ధికి సంబంధించి స్టాండప్‌ ఇండియా, పిఎంఈజిపి తదితర పథకాల ద్వారా యువ పారిశ్రామిక వేత్తలను గుర్తించాలన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ను ఆదేశించారు. సమావేశంలో ఇన్పుట్‌ సబ్సిడీ కింద 11 పరిశ్రమలకు రూ4.50 కోట్లు, వడ్డీ రాయితీ కింద 47 పరిశ్రమలకు 0.30 కోట్లను రుణాల మంజూరుకు సమావేశంలో ఆమెదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జిఎం చాంద్‌బాషా, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మురళీమోహన్‌, డిక్కీ ప్రతినిధి కె.వెంకటరమణ, రాజశేఖర్‌, శంకర్‌ప్రసాద్‌, నాగరాజు పాల్గొన్నారు.