Jul 19,2021 15:58

ఇస్లామాబాద్‌ : బక్రీద్‌ వేళ పాకిస్తాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్‌ జిల్లాలో సోమవారం ట్రక్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో 30 మంది మరణించారు. వీరిలో అత్యధికులు రోజువారీ కూలీలే. మరో 40 మంది గాయపడ్డారు. వీరంతా బక్రీద్‌ సందర్భంగా స్వస్థలాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సియాల్‌కోట్‌ నుండి రంజన్‌పూర్‌ వెళుతుండగా... తౌన్సా బైపాస్‌ సమీపంలో ఈ ఘోరకలి చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. మృతుల్లో కూలీలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా... 18మంది మరణించారు. మొత్తంగా 30 మంది చనిపోయారని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ మంత్రి పహాద్‌ చౌదరి వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి ఉస్మన్‌ బుజ్దర్‌... ఇంటీరియర్‌ మంత్రి షేక్‌ రషీద్‌ విచారం వ్యక్తం చేశారు.