సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-కందుకూరు :ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ రామాయపట్నం వద్ద నుంచి నెల్లూరు వరకు సిపిఎం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 13వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు సిపిఎం వలేటివారిపాలెం మండల ఇన్‌ఛార్జి జివిబి కుమార్ పేర్కొన్నారు. సోమవారం వలేటివారిపాలెంలోని ప్రగతి స్కూల్ వద్ద సిపిఎం వలేటివారిపాలెం మండల సమావేశం ఆ పార్టీ మండల నాయకులు సాధు.చెన్న కేశవులు అధ్యక్షత న జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు జీవీబీకుమార్ పాల్గొని మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి అవకాశవాద రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయని విమర్శించారు. సిపిఎం మండల నాయకులు దువ్వూరి జాన్, పివి రామారావు,పర్రె భాస్కరరావు, నేలకూరి వెంకటేశ్వర్లు,మంగి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు










