Jan 10,2023 22:03

నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పెనుకొండ నాయకులు

ప్రజాశక్తి రొద్దం : తన పాదయాత్రలో యువత పాత్ర కీలకమని టిడిపి జాతీయ నాయకులు నారా లోకేష్‌ అన్నారు. హైదరాబాద్‌లోని నారాలోకేష్‌ స్వగృహంలో పెనుకొండకు చెందిన టిడిపి నాయకులు నారాలోకేష్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా లోకేష్‌ మాట్లాడుతూ త్వరలో తాను చేపట్టబోయే యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కీలక పాత్ర పోషించాలన్నారు. పెనుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పార్థసారథి ఆధ్వర్యంలో యువగళం పాదయాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈసందర్భంగా నారాలోకేష్‌కు చెప్పినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఈసందర్భంగా కార్యకర్తల కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసే వారికి అండగా ఉంటానని, వారికే భవిష్యత్‌ ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు. నారాలోకేష్‌ను కలిసిన వారిలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరికృష్ణ, ఈడిగ నరసింహమూర్తి, గోనుగుంట్ల ప్రశాంత్‌, నాగలురు రాజు, శివ, కోగిర జయకృష్ణ, పెద్దిపల్లి అంజి, రాణా ప్రతాప్‌, కొల్లయ్య తదితరులు ఉన్నారు.