ప్రజాశక్తి - వన్‌టౌన్
పాడిరైతులకు 2022-2023 ఆర్ధిక సంవత్సరంనకు గాను మొదటి విడత (ఏప్రిల్ నుండి జులై మాసములకు) బోనస్ కింద 16 కోట్ల రూపాయలను చెలించేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుందని కష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని అంజనేయులు చెప్పారు. శనివారం జరిగిన పాలక వర్గ సమావేశం వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. గత ఆర్ధిక సంవత్సరంలో (2021 2022) మూడు విడతల క్రింద 50 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయటం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో పాడి రైతు, పశు సంక్షేమం కింద ఈ నాలుగు నెలలకు గాను 5 కోట్లు ఖర్చు చేశామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా పాలక వర్గ సభ్యులు యెర్నేని సీతాదేవి, డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన్‌రావు, వి.బి.కె.వి సుబ్బారావు, ఉయ్యూరు అంజి రెడ్డి, అర్జా వెంకట నగేశ్, వేమూరి సాయి వెంకటరమణ, చలసాని చక్రపాణి, పల్లగాని కొండల రావు పాల్గొన్నారు.










