రోడ్డుపై గాయాలతో పడిన వ్యక్తి
పాదాచారులను ఢకొీట్టిన బైక్
అన్నదమ్ములతో సహా ముగ్గురికి తీవ్ర గాయాలు
చికిత్స పొందుతూ అన్న మతి
కొడవలూరు :అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రోడ్డు దాటుతున్న పాదాచారులను శర వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములైన పాదాచారులిద్దరూ తీవ్రంగా గాయపడడంతోపాటు మోటార్ సైక్లిస్ట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని నాయుడుపాలెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిట్రగుంటకు చెందిన గుర్రంకొండ మాల్యాద్రి (50) ఆయన తమ్ముడు రఘులు కారులో నెల్లూరుకు బయలు దేరారు. మార్గమధ్యలో నాయుడుపాలెం వద్ద కారు అపుకొని ఇక్కడ హైవేకు పడమర వైపున్న అశోక్ నగర్ లోని బంధువుల ఇంటికి వెళ్లి వారిని పలుకరించారు. కొద్ది సేపటి తరువాత కారు వద్దకు వెళ్లేందుకు అన్నదమ్ములిద్దరూ రోడ్డు దాటుతుండగా, నెల్లూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఇద్దర్నీ ఢకొీట్టింది. దీంతో అన్నదమ్ములిద్దరూ రోడ్డుపై పడిపోవడంతోపాటు బైక్ నడుపుతున్న గణపతి కూడా పడిపోయారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ జి సుబ్బారావు ఘటన స్థలానికి చేరుకొని 108 సాయంతో తీవ్రంగా గాయపడ్డ అన్నదమ్ములిద్దర్నీ నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడ్డ నెల్లూరుకు చెందిన మోటర్ సైక్లిస్ట్ గణపతిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాలాద్రి (50 )మంగళవారం ఉదయం మతి చెందారు. మతుని తమ్ముడు రఘు మాత్రం అక్కడే చికిత్స పొందుతున్నారు. నెల్లూరుకు చెందిన గణపతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు ఎస్‌ఐ తెలిపారు.










