ఆటలు ఆడుతున్న విద్యార్థినులు
ఓవెల్ పాఠశాలలో 'ట్విలైట్ ఫియాస్ట్ ' వేడుకలు
నెల్లూరు:నగరంలోని 11వ డివిజన్ సరస్వతి నగర్ ప్రాంతంలో ఉన్న ఓవెల్ మోడ్రన్ పాఠశాలలో శనివారం ట్విలైట్ పియస్ట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి నిత్యం ఉద్యోగ నిర్వహణలో తలమునకలౌతూ యాంత్రిక జీవనయానం సాగిస్తున్న తల్లిదండ్రులకు ఆటవిడుపుగా ఉండటానికి వింటర్ పెస్ట్ నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు, పురుషులకు వేరు వేరుగా క్రీడా పోటీలు నిర్వహించారు. పురుషులు వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, షార్ట్ పుట్, కబడ్డీ మహిళలకు రంగోలి,త్రోబార్,మెహందీ, మ్యూజికల్ చైర్స్,లెమన్ అండ్ స్పూన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓవెల్ మోడ్రన్ పాఠశాల సిఇఓ ప్రమీల హాజరై పోటీలను ప్రారంభించారు. మహిళలు వేసిన వివిధ రంగు రంగుల ముగ్గులు తిలకించి వారిని అభినందించారు.పై కార్యక్రమములో విద్యార్ధుల తల్లిదండ్రులందరూ చాలా ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభను కనపరిచిన తల్లిదండ్రులకు ప్రధమ, ద్వితియ, తతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమణ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారావు, రమాదేవి, ఎజీయం సునీల్, పి.ఈ.టి వెంకటేష్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










