Jan 25,2023 18:25

ఓటు హక్కు గురించి ప్రతిజ్ఞ చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ఓటు హక్కుపై అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్ధేశ్యమని ఎంపిడిఒ కన్నం హేమలత తెలిపారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా ఎంపిడిఒ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న వారికి ఓటు విలువ తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. తోటపల్లిగూడూరు సచివాలయంలో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విఆర్‌ఒ శీరం శ్రీనివాసులు మాట్లాడారు. మాజీ జెడ్పిటిసి చిరంజీవి గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి, సచివాల యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు