ఫొటో : మాట్లాడుతున్న బాధితుడు పాదర్తి శంకర్రావు
ఓటు గల్లంతుపై గ్రాడ్యుయేట్ ఆవేదన
ప్రజాశక్తి-అల్లూరు : స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సోమవారం తూర్పు రాయలసీమ ప్రాంతాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పాదర్తి శంకర్రావు అనే ఓ గ్రాడ్యుయేట్ ఓటు గల్లంతు కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తపరిచారు. ఐడి నెంబర్ ఉన్నా సీరియల్లో 2 సార్లు పేరు నమోదు కావడంతో అధికారులు ఓటు లేకుండా చేశారని విచారం వ్యక్తపరిచారు. 1995 నుండి రెండు దఫాలు ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలియజేశారు. గ్రాడ్యుయేట్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమాధానం చెప్పే స్థితిలో అధికారులు లేరని సంబంధిత విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు.










