Jan 07,2023 18:46

వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు  జిల్లా కలక్టరేట్‌లో డి అర్‌ఒ ఆధ్వర్యంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓటర్ల జాబితా పై జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, ఆపార్టీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారీలో అనేక అక్రమాలు జరిగాయని వాటి పై విచారణ జరిపి బోగస్‌ ఓట్లను తొలగించాలని, పట్టభద్రుల ఓటర్ల జాబితా తయారీలో అనేక తప్పులు ఉన్నాయన్నారు. సరిదిద్దాలని సమావేశంలో కోరడం తో పాటు దీనిపై డి అర్‌ ఓకి వినతి పత్రం వినతిపత్రం అందజేశారు. జిల్లా అధికారులు,,తెలుగుదేశం పార్టీ తరుపున చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, ఎస్‌ కే రసూల్‌, దర్శి హరికష్ణ పాల్గొన్నారు.