Feb 20,2022 11:22

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగర మేయర్‌, బిజెపి నేత ప్రమీలా పాండే చిక్కుల్లో పడ్డారు. యుపి మూడవ దశ ఎన్నికల్లో భాగంగా కాన్పూర్‌లోని హుద్‌సన్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు ఆమె వెళ్లారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌తో ఓటు వేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశారు. తాను ఓటు వేస్తున్నట్లు ఇవిఎం వద్ద ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇది పలు వాట్సప్‌ గ్రూపుల్లో విపరీతంగా షేర్‌ కావడంతో జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఓటింగ్‌ గోప్యతను ఉల్లంఘించినందుకు ప్రమీలా పాండేపై పలు సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. మొత్తం 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు మూడవ దశలో పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.