Sep 20,2023 09:56

ప్రజాశక్తి-ముదిగుబ్బ : సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లులో మంగళవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో మంజుల అనంతయ్య( 55) మృతి చెందగా, మరో 9 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దొరిగిల్లు క్వార్టర్స్ వద్ద వినాయకుని మండపం వద్దకు నలుగురు యువకులు బైక్ పై విన్యాసాలు చేయడం.. ఘర్షణకు దారీ తీసిందని పోలీసులు తెలిపారు. ముదిగుబ్బ టౌన్ సీఐ హేమంత్ కుమార్ పరిస్థితిని అదుపు చేశారు.