ప్రశంసాపత్రాలతో విద్యార్థులు
పెనుకొండ : నేషనల్ లెవెల్ ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ పరీక్షలలో పట్టణంలోని గ్లోబల్ జెన్ పాఠశాల విద్యార్థులు 94 మంది మెడల్స్ సాధించినట్లు ఆ పాఠశాల చైర్మన్ యు. శ్రీనివాసులు తెలిపారు. పాఠశాలకు చెందిన కె. హర్ఫిత్ సాయి 6వ ర్యాంక్, టి. లిఖిలేష్ రెడ్డి 147వ ర్యాంక్, కె. ధనస్సు 19 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈసందర్భంగా ఆయన అభినందించి ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరారు. అదేవిధంగా నేషనల్ లెవెల్ లో 94 మెడల్స్ సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంచివాణి తదితరులు పాల్గొన్నారు.










