Dec 24,2020 21:46

జెనీవా: చైనా స్విమ్మర్‌, మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ సన్‌ యంగ్‌కు ఊరట లభించే అవకాశముంది. స్విట్జర్లాండ్‌లోని లాసన్సె కోర్టు సన్‌ యంగ్‌పై విధించిన 8 ఏళ్ల నిషేధంపై పునరాలోచన చేయనుంది. డోపింగ్‌ ఆరోపణలతో సన్‌యంగ్‌పై స్విట్జర్లాండ్‌ కోర్టు గతంలో 8ఏళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లౌసాన్‌ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ త్వరలో జరిపే రెండో విచారణలో సన్‌ యంగ్‌పై నిషేధం ఎత్తివేస్తే 2021 ఒలింపిక్స్‌లో అతడు పాల్గనే అవకాశముంది. 29ఏళ్ళ సన్‌ యంగ్‌ చైనాకు ఒలింపిక్స్‌లో 200మీ. స్విమ్మింగ్‌ పోటీలో స్వర్ణ పతకం గెల్చిన ఏకైక స్విమ్మర్‌.