చెన్నయ్ : ద్విచక్ర విద్యుత్ వాహనల తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు రిపోర్టులు వచ్చాయి. తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్‌లో తయారీ నిలిపివేసినట్లు ఇటి ఓ కథనం ప్రచురించింది. అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది. బుక్ చేసుకున్న వారి కోసం డెలివరీ చేయాల్సిన స్కూటర్ల కంటే అదనంగా 4వేల పైగా యూనిట్లు నిలిచిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ కంపెనీ వాహనాలకు భారీ డిమాండ్ నెలకొనగా.. ఇటీవల పలు చోట్ల వాటిలో ప్రమాదాలు జరగడంతో డిమాండ్ దెబ్బతిని ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. వార్షిక నిర్వహణలో భాగంగా తాత్కాలికంగా తయారీని నిలిపివేశామని ఆ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.










