Dec 11,2022 10:49

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్న టిడిపి నాయకులు

            ధర్మవరం టౌన్‌ : ఒక్కఛాన్స్‌ పేరుతో జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, ఇదే విషయాన్ని ప్రజలు తమ వద్ద ఏకరువు పెడుతున్నారంటూ టీడీపీ నాయకులు తెలియజేశారు. శనివారం పట్టణంలోని 30, 14, 37వ వార్డుల్లో ఇదేం ఖర్మమన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీడీపీ హయంలో చేసిన చేసిన అభివద్ధి, సంక్షేమపథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, బోయ రవిచంద్ర, పరిసే సుధాకర్‌, నాగూర్‌ హుస్సేన్‌, మారుతీస్వామి, కేశగాళ్ల శీన, అత్తర్‌ రహీం, రాయపాటి శివ, తొగట అనిల్‌, నారాయణస్వామి పాల్గొన్నారు.