Jul 19,2021 11:11

తిరుప్పూరు (చెన్నై) : విషం కలిపిన ధాన్యాన్ని తిని 19 నెమళ్లు మృతి చెందిన ఘటన తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని ఓ పొలం వద్ద చోటుచేసుకుంది. పొలం వద్ద 19 నెమళ్లు మృతి చెంది పడి ఉండటాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించి పరిశీలన చేపట్టారు. పల్లడం సమీపంలోని ఓ చేనులో విషం కలిపిన ధాన్యాన్ని తిని ఆ నెమళ్ళు మృతి చెందినట్లు పరిశీలనలో నిర్థారణ అయ్యింది. ఆ నెమళ్ళకు విషమిచ్చి చంపిన వ్యక్తుల ఆచూకీని కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.