Jul 19,2021 17:14

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి నోరాకి సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయి. వెంటనే చిత్రయూనిట్‌ ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఇటీవల 'భుజ్‌ : ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రం 1971 ఇండో - పాక్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయలో... నోరా, తన సహ నటుడు ఇద్దరూ యాక్షన్‌ సన్నివేశం కోసం ముందే రిహార్సల్స్‌ చేశారు. డైరెక్టర్‌ ఆ యాక్షన్‌ సన్నివేశాన్ని ఒకే టేక్‌లో షూట్‌ చేయాలని అనుకున్నారు. అయితే తుపాకీతో చేసే ఆ యాక్షన్‌ సన్నివేశంలో.. అనుకోకుండా తన సహనటుడు తుపాకీని తన ముఖానికి విసరడంతో.. నోరా నుదుటిపై గాయమై రక్తం వచ్చి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదాన్ని మూవీలో ఆ సన్నివేశాన్ని అలానే ఉంచాలని చిత్రయూనిట్‌ భావించిందట.
నోరాకు ఇదొక్కటే కాదు.. అంతకుముందు కూడా.. యాక్షన్‌ సన్నివేశాల కారణంగా తన చేతి వేళ్లకు.. మోచేతికి బలమైన గాయాలవ్వడంతో ఆమె స్లింగ్‌ ధరించింది. ఇక భుజ్‌ సినిమాలో అజరుదేవగన్‌, సంజరుదత్‌, సోనాక్షి సిన్హా, శరద్‌ కేల్కర్‌, మమ్మీ విర్క్‌ కూడా నటించారు. ఈ సినిమాకు అభిషేక్‌ దుధయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విఐపిలో విడుదల కానుంది.