పెనుకొండ : అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలతో లబ్ది చేకూరుతోందని వైసిపి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగర పంచాయతీ లోని 20 వ వార్డు పరిధిలోని కొండాపురం, మంగాపురం గ్రామాలలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు. అదేవిధంగా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ ఫరూక్, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్, ఎంపీడీవో శివశంకరప్ప, తహశీల్దార్ స్వర్ణలత, వైసిపి నాయకులు పొగాకు రామచంద్ర, ఎంపీపీ గీతారామ్మోహన్ రెడ్డి, టౌన్ కన్వీనర్ నరసింహ, కౌన్సిలర్లు భాస్కర్ నాయక్, రఘనాథ్ రెడ్డి, తయూబ్, రామాంజి, గణేష్, బోయ బాబు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట :మండలంలోనివేపరాల గ్రామ సచివాలయ పరిధిలోని చిన్నక్కగారిపల్లిలో శుక్రవారం నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానికఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనప్పచ ఏవో లక్ష్మి ప్రియచ ఎంపీపీ జగన్మోహన్, వైసీపీ మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు ఎస్. ఫయాజ్ అలీతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని గాండ్ల వారి పల్లి పంచాయతీలోని బి కొట్టాలచ కమ్మవారి పల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గుడ్‌మార్నింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రతి గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, ఇందుకూరు నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సేవ్యానాయక్, తిరుమల బారుతో పాటు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు










