ప్రజాశక్తి-వాల్మీకిపురం: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నవరత్నాల ద్వారా ప్రజలకు నేరుగా పథకాలను వారి ఖాతాల్లో జమ చేస్తూ.. ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గండబోయనపల్లిలోని ఎమ్మెల్యే చింతల, ఎపిఎండిసి డైరెక్టర్ హరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కలికిరి మండలం పల్లవోలుకు చెందిన టిడిపి నాయకులు శేఖర, చిన్న రెడ్డెప్పరెడ్డి, సంపత్, ఎల్లయ్య, వెంకటేష్, చోటేసాబ్, రమేష్, శ్రీనివాసులు తదితరులు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరిని ఎమ్మెల్యే చింతల వైసిపి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శరత్ కుమార్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డి, రమేష్ కుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, శీనా పాల్గొన్నారు.










