నవరత్నాల ఇళ్లకు జియో ట్యాగింగ్
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని తూర్పు బోయమడుగుల గ్రామం జగనన్న నవరత్నాలు సంబంధమైన 121 ఇల్లు మంజూరు కాగా శుక్రవారం షెడ్యూల్డ్ తెగలకు చెందిన 9 మందికి వర్క్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నాయబ్ రసూల్ జియో ట్యాగింగ్ చేశారు. అనంతరం వర్క్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ కాలనీల్లో అధునాతన సౌకర్యాలు వస్తాయని, జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మాణం చేసుకోవాలని సొంతగా కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మింస్తుందన్నారు. సొంత స్థలాలు ఉండి, ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుందని ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు అందిస్తుందని తెలిపారు. అర్హులు ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తారని ఇళ్ల నిర్మాణం వల్ల కూలీలకు పెద్ద సంఖ్యలో పని దినాలు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాగంటి శ్రీనివాసులు (సిద్దయ్య), గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేయర్లు, వాలంటీర్లు, ఇంటి పట్టా లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.










