Oct 26,2023 21:25

క్రికెట్‌ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌

నవంబర్‌కల్లా క్రికెట్‌ స్టేడియం పూర్తవ్వాలి : కమిషనర్‌
తిరుపతి టౌన్‌ : మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గొల్లవానిగుంట వద్ద నిర్మిస్తున్న క్రికెట్‌ స్టేడియం నవంబర్‌ పది లోపు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత ఐఏఎస్‌ ఆదేశాలు జారీ చేసారు. గొల్లవానిగుంట వద్ద నిర్మాణంలో వున్న క్రికెట్‌ స్టేడియం పనులను గురువారం కమిషనర్‌ హరిత ఐఏఎస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేస్తూ నగర ప్రజలకు ముఖ్యంగా క్రికెట్‌ క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చేలా టర్ప్‌ మ్యాట్‌ క్రికెట్‌ క్రీడలు నిర్వహించేలా నిర్మిస్తున్న క్రికెట్‌ స్టేడియం పనులను నవంబర్‌ పది లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా స్టేడియంలోనే నిర్మిస్తున్న వాకింక్‌ ట్రాక్‌ ను పరిశీలించి తగు సూచనలు జారీ చేస్తూ ప్రజలు సౌకర్యవంతంగా నడిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత ఐఏఎస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వెంట మునిసిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, మునిసిపల్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌, డిఈ విజయకుమార్‌ రెడ్డి, ఏయికామ్‌ ప్రతినిధి భాలాజీ పాల్గొన్నారు.

క్రికెట్‌ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌