Dec 09,2022 22:23

.సమావేశంలో మాట్లాడుతున్న ఎడిజె శైలజ

ప్రజాశక్తి-హిందూపురం : విద్యార్థినులు చదువుతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకొని నవ సమాజ నిర్మాణంలో పునరంకితం కావాలని అదనపు జిల్లా జడ్జి శైలజ పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఎన్‌ఎస్‌పిఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన జాతీయ మానహ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు నిజాయితీతో వ్యవహరించి తమ చదువులను కొనసాగించాలన్నారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ యశోదా దేవి, సిఐ ఇస్మాయిల్‌, ఎపిపి ఇందాద్‌, న్యాయవాదులు నాగరాజు రెడ్డి, సుదర్శన్‌, సిద్దు, శివశంకర్‌, కళావతి, నవేరా, ఫణిభూషన్‌, అధ్యాపకులు వెంకటేష్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ నరసింహులు, లోక్‌ అదాలత్‌ శారద తదితరులు పాల్గొన్నారు.