నూతన హంగులతో బస్టాండ్ ప్రారంభం
ప్రజాశక్తి-అనంతసాగరం : మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తికావస్తుండడంతో నూతన కల సంతరించుకుందని జెడ్‌పిటిసి వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బస్టాండ్ నిర్మాణం మండల ప్రజలకు కలగా మిగిలి పొగా, ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి, జెడ్‌పిటిసి కషితో దశాబ్దాల నాటికల నెరవేరిందన్నారు. ప్రయాణికులకు ఆధునాతన సౌకర్యాల కల్పనతో బస్టాండ్ ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలియజేశారు. ఈ మేరకు బస్టాండ్ నిర్మాణ పనులను నాయకులతో కలిసి జెడ్‌పిటిసి రాపూర్ వెంకటసుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, చూడడానికి అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం వచ్చినట్లు జెడ్‌పిటిసి పేర్కొన్నారు. ప్రయాణికులకు మోడ్రన్ టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం, ప్రయాణికులు కూర్చోడానికి అనుగుణంగా వసతి సౌకర్యాలు, మిగతా పనులను ఎలా జరుగుతున్నాయని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుని, మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బస్టాండ్ లేకపోవడంతో మండలంలోని ప్రజలతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు కూర్చోవడానికి స్థలం లేక, టాయిలెట్‌కి వెళ్లడానికి టాయిలెట్స్ లేక ఎండకు, వానకు, వేసవిలో మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారని తెలిపారు. బస్టాండ్ ప్రారంభమైతే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగినట్లేనని ప్రయాణికులు అనుకుంటున్నారు.










