Feb 07,2023 21:42

ఫొటో : సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

నూతన భవనాలు ప్రారంభం
ప్రజాశక్తి మర్రిపాడు : మండలంలోని బూదవాడ గ్రామంలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నూతన గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రాలను ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందలేదని జగనన్న ప్రభుత్వంలో అర్హులను వెతికి లబ్ధి చేకూర్చుతోందన్నారు.
ప్రజలు తమ సమస్యల పరిస్కారం కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా సచివాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి మాజీ కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు, వైసిపి నాయకులు సచివాలయ కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ హరిబాబు, వైస్‌ సర్పంచ్‌ ఈశ్వర్‌రెడ్డి, నాయకులు రామ్మోహన్‌ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, శివ, రెవెన్యూ అధికారులు, ఇఒపిఆర్‌డి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.